NTV Telugu Site icon

Biju Menon : శివకార్తికేయన్ సినిమాలో బిజు మీనన్

Biju Menon

Biju Menon

Biju Menon on board Siva Karthikeyan – AR Murugadoss : శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బిజు మీనన్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో బిజు మీనన్ ప్రజెన్స్ సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచేలా ఉంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్, యూనిక్ సెట్టింగ్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.

Jr NTR Watch: ఎన్టీఆర్ చేతి వాచ్ తో హైదరాబాదులో మూడు లగ్జరీ ఫ్లాట్లు కొనేయచ్చు తెలుసా?

ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ అండ్ మ్యాసీవ్ మూవీ. శివకార్తికేయన్ యూనిక్, స్టైలిష్ అవతార్ లో కనిపిస్తారని అంటున్నారు. ట్యాలెంటెడ్ కన్నడ యాక్ట్రెస్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజర మూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Show comments