NTV Telugu Site icon

Manamey : మొదటి రోజు కంటే భారీగా.. కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘మనమే’..

Manamey

Manamey

Manamey : టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ “మనమే”.టాలెంటెడ్ డైరెక్టర్  శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. సినిమాలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ,సీరత్ కపూర్,రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,ట్రైలర్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read Also :Devara : దేవర క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?

ఈ సినిమా జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమాలో హీరో శర్వానంద్ ,హీరోయిన్ కృతి శెట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.ఈ సినిమా కథ అంతా పిల్లాడి చుట్టూ తిరుగుతుంది.శర్వానంద్ ,పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ ఎంతో హిలేరియస్ గా అనిపిస్తాయి.ఈ సినిమాలో ఎంటెర్టైనేమేంట్ తో ఎమోషన్స్ కూడా ప్రేక్షుకులకు బాగా నచ్చాయి.ఈ సినిమా మొదటి రోజున 55k టికెట్స్ అమ్ముడయ్యాయి.అలాగే రెండో రోజు ఈ సినిమాకు ఏకంగా 67k టికెట్స్ బుక్ అయ్యాయి .దీనితో మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమాకు 21% ఎక్కువగా టికెట్స్ సేల్ అయ్యాయి.దీనితో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.ఈ సినిమా రెండు రోజుల్లో 3.40 కోట్లు రాబట్టి దూసుకుపోతుంది.

Show comments