NTV Telugu Site icon

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8.. ఎవర్రా మీరంతా? అనుకోకుండా ఉండలేరు!

Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu

Bigg Boss Telugu 8 Confirmed List : ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మొదలు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే వాళ్ళ లిస్ట్ అంటూ ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 16 మంది ఉన్న ఈ లిస్టులో కొన్ని పేర్లు మారవచ్చు అని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న లిస్టు ప్రకారం ఆదిత్య ఓం, అంజలి పవన్, నిఖిల్ మల్యాకల్, యశ్మీ గౌడ, అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, నైనిక అనసూరు, అభయ్ నవీన్, కిరాక్ సీత, ఖయ్యూం అలీ, విష్మయశ్రీ, నాగమణికంఠ, విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ భాష, సహర్ కృష్ణన్, న్యూస్ రీడర్ కళ్యాణి. వీళ్లు హౌస్ లోపలికి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది.

Mohanlal : హేమ కమిటీ కలకలం.. మోహన్ లాల్ సంచలన నిర్ణయం

అయితే వీరిలో ఆదిత్య హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అంజలి పవన్ కొన్ని సినిమాలు సీరియల్స్ చేసిన నటిగా పరిచయమే. అయితే నిఖిల్ మల్యాకల్, యశ్మీ గౌడ కొన్ని సీరియల్స్ చేసినా పెద్దగా నొటెడ్ కాదు. అభిరామ్ వర్మ నటుడే అయినా ఎవరికీ తెలియంది. బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ గా నైనిక అనసూరు డ్యాన్సర్ గా కొంత పరిచయమే. అభయ్ నవీన్ నటుడే అయినా చాలా తక్కువ మందికి తెలుసు. కిరాక్ సీత బేబీ సినిమాతో ఖయ్యూం అలీ అలీ తమ్ముడిగా కొంత పరిచయమే. విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ భాష, సహర్ కృష్ణన్ లకు కొంత పరిచయం ఉన్నా ఈ విష్మయశ్రీ, నాగమణికంఠ, న్యూస్ రీడర్ కళ్యాణి ఎవరో కూడా తెలియదు. ఇక వీరిలో ఖయ్యూం అలీ డౌట్ అని ఆయన రాకపోతే ఒక యూట్యూబర్ ను లోపలి పంపవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో?

Show comments