Site icon NTV Telugu

Bigboss: బిగ్ బాస్ 8కు హోస్ట్ గా కుర్ర హీరో.. ఈ సారి వేరే లెవల్..?

Untitled Design (90)

Untitled Design (90)

బుల్లి తెరపై బిగ్ బాస్ షో ఎంతటి పాపులర్ ఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ నుండి స్ఫూర్తి పొంది బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ను స్టార్ట్ చేసారు. అక్కడ ఈ షో పాపులర్ కావడంతో ఇండియాలో దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ షోను రీమేడ్ చేసారు. తెలుగులోను అదే పేరుతో jr.ఎన్టీయార్ హోస్ట్ గా తీసుకువచ్చారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో కంటిన్యూ గా చేస్తూ వస్తున్నారు. మరోవేపు తమిళ్ లో ఉలగనాయగన్ కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వచ్చిన బిగ్ బాస్ షో సూపర్ హిట్ అయింది.

Also Read: Tollywood : రెండు రోజుల ముందుగానే స్పెషల్ షోలు.. ఏ సినిమా అంటే..?

తమిళ్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సక్సెస్ ఫుల్ గా 7 సీజన్లని హోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్న సీజన్ 8 కు వ్యాఖ్యానించలేనని బిగ్ బాస్ షో నుండి తప్పుకున్నారు, ఆయనకు ఉన్న సినిమా కమిట్మెంట్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి జరగబోయే బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ అవ్వాలని విష్ చేసారు కమల్. ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్ 8 ను ఎవరు ముందుకు నడిపిస్తారు, హోస్ట్ గా ఎవరు వస్తారు, వచ్చినా ఇంతకు మునుపులా సక్సెస్ ఫుల్ గా నడపగలరా అన్న సందేహాలు ఆదరిలోనూ ఉండగా, తమిళ సినీ వర్గాల నుండి అదిరిపోయే అప్ డేట్ అందుతోంది. సీజన్ 8కు హోస్ట్ గా స్ యంగ్ సెన్సేషన్ శింబు వ్యవహరించనున్నాడని సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. దీంతో శింబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.

Exit mobile version