మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో తమిళనాడు అధికారులు బిగ్ బాస్ హౌస్ పై దాడులు నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మే 31 వరకు చిత్రీకరణలను నిలిపివేయాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఆదేశించిన.. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి ఈ షో షూటింగ్‌ను జరిపారు.
బిగ్‌బాస్ సెట్ సీజ్
