ప్రతి ఏడాది లాగానే, ఈ ఏడాది కూడా బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం సీజన్ 9 తెలుగులో సాగుతున్న సంగతి తెలిసింది. ఇక, ఈ వారానికి గాను ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లిస్టులో ఉన్నారు. ఈ మధ్యనే రాయల్ కార్డ్ ఎంట్రీ తో ఎంట్రీ ఇచ్చిన దివ్య, ఫ్లోరా సైని, హరిత హరీష్, రీతు చౌదరి, సంజన, శ్రీజ నామినేషన్లలో ఉండగా, ఈ వారం ఊహించని విధంగా హరీష్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మాస్క్ మ్యాన్ గా అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హరిత హరీష్.
Also Read:Komali Prasad : దాని కోసం లిప్ లాక్ ఇస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
హరిత అతని భార్య పేరు కాగా, తన పేరు ముందు పెట్టుకుని ఆసక్తికరమైన కాండిడేట్ గా నిలిచాడు. అయితే, బిగ్ బాస్ హౌస్ లో ఎవరి మాట వినకుండా తనకు తానే మోనార్క్ గా ఫీల్ అవుతూ ఆట ఆడుతూ రావడంతో, ఎందుకు జనాలు అతని మీద ఎక్కువ ఆసక్తి కనబరచలేదు. దీంతో, ఈ వారం బిగ్ బాస్ అతన్ని ఇంటికి పంపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ దెబ్బతో బిగ్ బాస్ 9 లో ఇప్పటివరకు ముగ్గురు కామనర్లు ఎలిమినేట్ అయినట్లుగా చెప్పొచ్చు. మొదటి వారం సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది. రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి తో పాటు, ఇప్పుడు నాలుగవ వారం హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడు.
