NTV Telugu Site icon

Big Boss 8: బిగ్ బాస్ సీజన్ -8 ఫైనల్ 14 కంటెస్టెంట్స్ వీళ్ళే..

Untitled Design (9)

Untitled Design (9)

బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని గంటల్లో మొదలుకాబోతుంది. 100 రోజులకు పైగా అన్ లిమిటెడ్ వినోదాన్ని అందించే ఈ షో ఈ సారి మాత్రం ఊహలకందని ట్విస్టులతో ఉండబోతుంది.ఎప్పుడూ ఒక్కొక్కరిని లోపలికి పంపించి అక్కడ అలరించే వినోదాన్ని అందించే వాళ్ళు.ఈసారి మాత్రం లేకండా బయట నుండే జంటలుగా లోపలికి పంపుతున్నారు.అంతకుమించిన సూపర్ ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్లు ఫస్ట్ వీక్ జరిగే ఎలిమినేషన్ ఈ సారి ఏకంగా ఫస్ట్ డే నే జరగబోతుంది.ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ అనే క్యాప్షన్ కి న్యాయం చెయ్యడం ఖాయం అని తెలుస్తుంది.

Also Read: Nani : సరిపోదా శనివారం’ చాలా లాంగ్ రన్ వుండే సినిమా: నేచురల్ స్టార్ నాని

అయితే ఇప్పటివరకు ఈ సీజన్ లో ఫస్ట్ డే ఎంతమంది లోపలికి వెళతారు?, వాళ్ళు ఎవరు అనేది కొంతవరకు క్లారిటీ ఉంది.ఇక్కడ పూర్తి క్లారిటీ ఇస్తున్నాం.ఈ సీజన్ లో మొదట రోజు 14 మంది లోపలికి వెళతారు.వీళ్ళలో బెజవాడ బేబక్క,విష్ణు ప్రియ,ప్రేరణ కంభం,యష్మి గౌడ,శేఖర్ బాషా,సీరియల్ యాక్టర్ నిఖిల్,ఆదిత్య ఓం,అభయ్ నవీన్,కిర్రాక్ సీత,నాగ మణికంఠ,ఢీ నైనిక పేర్లు ఇప్పటికే బయటికి వచ్చాయి.ఆ మిగిలిన వాళ్ళు ఎవరంటే స్టార్ మా లో వచ్చిన హిట్ సీరియల్ నాగ పంచమి హీరో పృథ్విరాజ్ లోపలికి వెళుతున్నాడు. యాక్టర్,డైరెక్టర్ అయిన నబీల్ ఆఫ్రిది కూడా లోపలికి వెళుతున్నాడు.ఇతనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక సర్ప్రైజ్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ మాత్రం సోనియా సింగ్.ఆమె ఈ సీజన్ కే హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి స్టార్టింగ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది.ఈ సీజన్ సక్సెస్ మాత్రం లోపలోకి వెళ్లిన కంటెస్టెంట్స్ ఆడే ఆటపై ఆధారపడి ఉంది.

Show comments