ప్రపంచవ్యాప్తంగా టాప్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త సీజన్‌తో సిద్ధమైంది. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ ఆగస్టు 24 ప్రారంభం అయ్యింది. ఈ షోలో ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉండంటంతో ప్రేక్షకులు మరింత ఖుఫి అవుతున్నారు.. అయితే ఈ సారి ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్‌లో సల్మాన్ ఏకంగా రూ. 250 కోట్లు వసూలు చేశారు. 17వ సీజన్ కోసం ఆయన రూ.200 కోట్లు తీసుకున్నారు. కానీ సీజన్ 19 కోసం ఆయన ఫీ కేవలం..
Also Read : Regina Cassandra : రెండు నగరాల మధ్య జర్నీ.. రెజీనా కొత్త మూవీపై ఎమోషనల్ పోస్ట్
రూ.150 కోట్లుకి తగ్గిపోయింది. దీనికి కారణం ఆయన హోస్టింగ్ డ్యూటీలు తగ్గించడం. గతంలో పూర్తిగా షో నడిపిన సల్మాన్, ఈసారి కేవలం 15 వారాల పాటు హోస్ట్ అవుతాడు. ప్రతి వీకెండ్ కోసం ఆయనకు దాదాపు రూ.10 కోట్లు చెల్లించనున్నారు. సల్మాన్ లేని వారాల్లో ఫరా ఖాన్ లేదా కరణ్ జోహార్ వంటి ప్రముఖులు గెస్ట్ హోస్ట్‌గా పాల్గొననున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు గతంలో కూడా కొన్ని సార్లు బిగ్ బాస్ హోస్టింగ్‌లో భాగమయ్యారు. అలాగే ఈ సీజన్‌లో పోలిటికల్ థీమ్ను ఫీచర్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ షో ప్రారంభం కానుంది. మొదట జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది, తర్వాత కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. ఫ్యాన్స్ కోసం రాబోయే ఎపిసోడ్‌లలో ఎలాంటి కొత్త ట్విస్టులు ఉంటాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. సల్మాన్ ఫీ తగ్గిన విషయం, గెస్ట్ హోస్టులు, కొత్త థీమ్ అని కలిపి బిగ్ బాస్ 19 సీజన్‌ను ప్రత్యేకంగా చేస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.
