NTV Telugu Site icon

Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి తప్పుకోవడం పై స్పందించిన బిగ్ బీ

Amithabachan

Amithabachan

బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చిన అందులో కొన్ని మాత్రం ఏళ్ల తరబడి నడుస్తూ నెంబర్ వన్ షోలుగా వెలుగొందుతున్నాయి. అందులో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఒకటి. బాలీవుడ్ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యావహరిస్తున్నా ఈ షో దాదాపు 25 ఏళ్లుగా భారతీయులను ఆకట్టుకుంటోంది. మొత్తం 16 సీజన్ల పాటు, నిరాటంకంగా రన్ అవుతున్న ఈ షో తో.. అమితాబ్ బచ్చన్‌ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. దీంతో ఆయన క్రేజ్ తగ్గకపోవడానికి ఒకింత కారణం అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఈ షో కు బిగ్ బీ గుడ్ బాయ్ చెబుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఈ వార్తలపై అమితాబ్ బచ్చన్ స్పందించాడు.

Also Read: Kalki : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ !

ఇక అమితాబ్ ప్లేస్‌లో ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని వార్తలు రాగా, తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు వినిపించింది. అయితే గతంలో అమితాబ్ లేనప్పుడు సీజన్ 3కి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. దీంతో నెక్ట్స్ సీజన్‌కు షారుఖ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. ఇక ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టాడు అమితాబ్ బచ్చన్‌. తాజాగా 16వ సీజన్ చివరి ఎపిసోడ్ ముగిసే ముందు ఆయన మాట్లాడుతూ.. ‘గత 16 సీజన్లుగా ఈ కార్యక్రమం విశేష ఆదరణ లభించింది. దాదాపు 25 ఏళ్లుగా నాపై అదే ప్రేమ, మద్దతు చూపిస్తున్నారు. వచ్చే సీజన్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను’ అని అమితాబ్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘కల్కి 2’తో పాటు ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నాడు.