Site icon NTV Telugu

“భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ట్రైలర్… చూస్తే ఒళ్ళు గగుర్పొడవాల్సిందే..!

Bhuj: The Pride of India Trailer

కరోనా వైరస్ మహమ్మారి తరువాత చాలా మంది బాలీవుడ్ స్టార్స్ సినిమాల విషయంలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారు. వాటిలో ఒకటి అజయ్ దేవ్‌గన్ నటించిన “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా”. ఈ దేశభక్తి చిత్రం డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ లోని యుద్ధ సన్నివేశాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు గురి కావాల్సిందే. ట్రైలర్ లో ఆ రేంజ్ లో డైలాగులు, యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఇక దానికి తోడు నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. “భుజ్” కథ 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోంది.

Read Also : రామ్ కూడా మొదలు పెట్టేశాడు !

యుద్ధ సమయంలో భుజ్ విమానాశ్రయానికి ఇన్‌చార్జిగా పని చేసిన ఐఎఎఫ్ స్క్వాడ్రన్ నాయకుడు విజయ్ కర్నిక్ పాత్రలో అజయ్ దేవ్‌గన్ నటించారు. పాకిస్తాన్ దళాలు భుజ్ విమానాశ్రయంపై దాడి చేసిన తరువాత అతను ఒక పొరుగు గ్రామానికి చెందిన 300 మంది మహిళల సహాయంతో మొత్తం ఎయిర్ బేస్ ను ఎలా పునర్నిర్మించాడో ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సంజయ్ దత్, సోనాక్షి సిన్హా అజయ్ దేవ్‌గన్‌కు సపోర్ట్ చేసే గ్రామస్తుల పాత్రల్లో నటించారు. శరద్ కేల్కర్, అమ్మి విర్క్, నోరా ఫతేహి భారత సైనికులుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అజయ్ కు జోడిగా ప్రణీత సుభాష్ నటిస్తోంది. అభిషేక్ దుధయ్య దర్శకత్వం వహించారు. “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ఆగస్టు 13 న ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది.

Exit mobile version