Site icon NTV Telugu

Bharatyeedu 2 : సిద్దార్థ్ కు బర్త్ విషెస్ చెప్పిన చిత్ర యూనిట్.. పోస్టర్ వైరల్..

Whatsapp Image 2024 04 17 At 2.19.13 Pm

Whatsapp Image 2024 04 17 At 2.19.13 Pm

విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “భారతీయుడు 2 “. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’.శంకర్ ,కమల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.అప్పట్లో భారతీయుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది .ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తి పెరిగింది .అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు.ఎన్నో అడ్డంకులను అధిగమించి షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు సినిమాను తాజాగా జూన్ నెలలో విడుదల చేస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌ లో తెల్లటి ధోతి మరియు కుర్తాలో కమల్ హాసన్ కనిపించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్ అగర్వాల్‌, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌.జె.సూర్య మరియు బాబీ సింహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు .ఇప్పటికే అనిరుద్ కంపోజ్ చేసిన భారతీయుడు గ్లింప్సె కు సూపర్ రెస్పాన్స్ లభించింది.ఇదిలా ఉంటే నేడు హీరో సిద్దార్థ్ పుట్టినరోజు .ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సిద్దార్థ్ లుక్ ను రిలీజ్ చేసింది . మీ వైవిధ్యభరితమైన పాత్రలు మరియు కాలాతీత ఆకర్షణ అందరినీ ఆకర్షిస్తూనే ఉన్నాయి.. ఇదిగో మీ ప్రయాణంలో మరో ఏడాది విజయం అంటూ భారతీయుడు టీం సిద్ధార్థ్ కు బర్త్డే విషెస్ తెలియజేసింది .

Exit mobile version