NTV Telugu Site icon

Bharatheeyudu 2 : ‘భారతీయుడు 2 ‘ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్..

Bharatheeyudu2

Bharatheeyudu2

Bharatheeyudu 2 : లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాను భారీ బడ్జెట్ తో నిమించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.భారతీయుడు 2 లో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Kalki 2898 AD : కల్కి స్టోరీ రివీల్ కు కారణం అదేనా..?

‘భారతీయుడు 2’  సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. దీనితో సినిమాకి బాగా హైప్ వచ్చేలా భారీగా ప్రమోట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ అప్డేట్ ని ఇచ్చారు. భారతీయుడు 2 ట్రైలర్ ను మేకర్స్ నేడు ( జూన్ 25) న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ టైం ను ప్రకటిస్తూ మేకర్స్ ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో గుబురు గడ్డంలో వున్న కమల్ హాసన్ లుక్ అదిరిపోయింది. మేకర్స్ భారతీయుడు 2 ట్రైలర్ ను నేడు సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.