Site icon NTV Telugu

Bharateeyudu 2 : శంకర్ సార్.. ఇంకెన్ని షాక్ లు ఇస్తారు..?

Whatsapp Image 2024 05 05 At 8.27.02 Am

Whatsapp Image 2024 05 05 At 8.27.02 Am

విశ్వనటుడు కమల్ హాసన్ ,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నలేటెస్ట్ మూవీ “భారతీయుడు 2 “. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా మరియు ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఉదయనిధ స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి గ్రాండ్ గా నిర్మిస్తుంది.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ లో థియేటర్స్ కు రానున్నట్లు ప్రకటించారు.

అయితే విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు .అయితే ఇప్పుడు ఈ సినిమా జూన్ లో విడుదల కావడం కష్టమని తెలుస్తుంది .పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 ఏడి “..సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది .ముందుగా ఈ మూవీ మే 9 న విడుదల కావాల్సి వుంది .కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.దీనితో జూన్ 27 న ఈ సినిమా విడుదల కానుంది.అయితే భారతీయుడు 2 సినిమాను జూన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమైన కూడా ప్రభాస్ మూవీ ఉండటంతో ఏ తేదీన రిలీజ్ చేసేది క్లారిటీ ఇవ్వలేదు .దీనితో ఈ మూవీ విడుదల జులై కి వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది .

Exit mobile version