Site icon NTV Telugu

Bhagyashree : దీపికా, మృణాల్, రష్మిక, జాన్వీ తో పాటు భాగ్యశ్రీ..?

Bagyasree

Bagyasree

తాజాగా విడుదలైన చిత్రం ‘కింగ్డమ్’. స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో పాటు యువ నటి భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రం జూలై 31న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో, ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్ రిలీజ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ నటనకు విశేష స్పందన లభించడంతో, ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో నటించగా, ఇప్పుడు మరో భారీ అవకాశం దక్కిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా భారీ ఆఫర్ అంటే..

Also Read : Alia Bhatt : ఏకంగా 5 నేషనల్ అవార్డులతో.. సత్తా చాటిన అలియా భట్ ‘గంగూబాయి’

ప్రజంట్ టాలీవుడ్ నుండి తెనకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీస్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘AA22xA6’ ఒక్కటి. ఇది దాదాపు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు ఉండబోతున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన హీరోయిన్‌గా దీపికా పదుకోణే ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్ కాగా, మృణాల్ ఠాకూర్ పేరు కూడా స్ట్రాంగ్ బజ్‌గా వినిపిస్తోంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినపడ్డాయి.. ఇన్నుడు వీరితో పాటు, తాజాగా భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకుందని టాక్. అయితే మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నిజంగానే భాగ్యశ్రీకి ‘AA22xA6’ ప్రాజెక్ట్‌లో అవకాశం దొరికితే, అది ఆమె కెరీర్‌కు గేమ్‌చేంజర్ అవుతుంది.

Exit mobile version