Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నివిన్ పౌలి హీరోగా ప్రేమలు వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు గిరీష్ ఏడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit). అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్క్కిన ఈ సినిమా ఓనం కానుకగా ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రారంభం నుంచే చాలా క్లీన్‌గా, ఫన్ అండ్ రొమాంటిక్ మూడ్‌తో సెట్ చేసాడు దర్శకుడు.
ముఖ్యంగా గిరీష్ ఏడి రాసుకున్న వన్ లైన్ పంచులు హిలేరియస్ గా నవ్వించాయి. కథకు తగ్గట్టు స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్, కామెడీ టైమింగ్ కథను ముందుకు నడిపించాయి. నివిన్ పోలీ, మమితాల మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతో ఆకట్టుకుంది. కథనంలో వచ్చే చిన్న చిన్న బ్యూటిఫుల్ మూమెంట్స్, విష్ణు విజయ్ అందించిన సంగీతం, పాటలు ప్రథమార్ధానికి ప్రధాన బలంగా నిలిచాయి. క్యూట్ అండ్ పర్ఫెక్ట్ ఇంటర్వెల్ మోడ్‌తో మొదటి భాగం ముగుస్తుంది. సెకండాఫ్‌లో కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించినా, క్లైమాక్స్ వచ్చేసరికి మళ్లీ కథ పుంజుకుంటుంది. ఒక అందమైన భావోద్వేగమైన ముగింపుతో సినిమాను పూర్తి చేయడం థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మొత్తానికి నివిన్ పోలీ మార్క్ కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ కావాలనుకునే వారికి ఇది పక్కా వర్త్ వాచ్ ఫిల్మ్. గతేడాది సర్వం మాయతో సాలిడ్ హిట్ అందుకున్న నివిన్ ఇప్పుడు బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓనం విన్నర్ గా నిలిచింది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!