NTV Telugu Site icon

Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే..

Bhairavam

Bhairavam

 తమిళంలో ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం ‘గరుడన్’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని  తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్.

Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్‌.. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తాం

ఈ సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవల ముగిసిన షెడ్యూల్ లో అదితి శంకర్ సీన్స్ కంప్లీట్ చేశారు దర్శకుడు. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది అనగా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ అయితే లేదు. కానీ ఈ బెల్లంకొండ మాత్రం ఫెరోషియస్ గా కనిపిస్తున్నాడు. దర్శకుడు విజయ్ తెలుగు నేటివిటికి తగ్గట్టు ఈ సినిమాను పర్ఫెక్ట్ గా ఛేంజ్ చేసాడని బెల్లంకొండ హిట్ కొడతాడు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Show comments