NTV Telugu Site icon

Bhairavam Teaser : ‘భైరవం’ టీజర్.. బెల్లంకొండ సాయి జీవించాడుగా!

Bhairavam Teaser

Bhairavam Teaser

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర తన కలలో సృష్టించిన వైలెన్స్ వివరిస్తూ, అతని యాక్షన్ ని శ్రీకృష్ణుడితో పోలుస్తూ లేడీ వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ కథ వారాహి గుడి, ముగ్గురు స్నేహితులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు నారా రోహిత్ చుట్టూ సాగుతుంది. వారు ఒకరి కోసం ఒకరు ఎంతకైనా తెగిస్తారు.

Pavitra Lokesh: నైట్ అయితే అలసిపోతా..నా వల్ల కాదు.. నరేష్ పై పవిత్ర లోకేష్ కీలక వ్యాఖ్యలు

ప్రారంభ సన్నివేశాలు శ్రీనివాస్ పాత్ర ఇంటెన్స్ నేచర్ ని హైలైట్ చేయగా, చివర్లో దేవుని ఆశీర్వాదం పొందుతున్నట్లుగా కనిపించడం కథలోని డివైన్ ఎలిమెంట్ ని సూచిస్తోంది. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ పవర్ ఫుల్ టీజర్ ద్వారా సినిమా లీడ్ రోల్స్ సెంటర్ కాన్ఫ్లిక్ట్ ని పరిచయం చేస్తూ, సినిమా ప్రిమైజ్ ని రివిల్ చేశారు. టీజర్ విజువల్ గా అద్భుతంగా ఉంది, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు గ్రాండ్ గా వున్నాయి. హరి కె వేదాంతం ఆకట్టుకునే కెమెరా పనితనం ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల తన ఇంటెన్స్ స్కోర్‌తో ఎక్స్ పీరియన్స్ ని మరింత ఎలివేట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ లుక్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనోజ్ మంచు, నారా రోహిత్ కూడా ఫెరోషియస్ అండ్ డైనమిక్ రోల్స్ లో కనిపించారు. టీజర్ వారి ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసింది. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు. హై-ఆక్టేన్ టీజర్ తో భైరవం గొప్ప అంచనాలను క్రియేట్ చేసింది.