Site icon NTV Telugu

రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్

Bellamkonda Sai Sreenivas and V V Vinayak's Bollywood Film launched with a formal Pooja Ceremony

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తన మొదటి చిత్రం “అల్లుడు శీను” డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛత్రపతి” హిందీ రీమేక్ తో. ‘ఛత్రపతి’ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. కాగా తాజాగా ఈ రోజు సినిమా ప్రారంభం జరిగింది. రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read Also : “చిన్నారి పెళ్లి కూతురు” బామ్మ ఇకలేరు

ముహూర్తం షాట్ కు దర్శకధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, రమ రాజమౌళి కెమెరా ఆన్ చేశారు. ఎ.ఎం.రత్నం మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కావడం విశేషం. భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ చిత్రానికి ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పకుడు. సినిమా కోసం నిర్మించిన భారీ విలేజ్ సెట్లో ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. బెల్లంకొండ హీరో ఇప్పటికే ఈ సినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. మరి బాలీవుడ్ లో మొదటి చిత్రంతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.

Exit mobile version