NTV Telugu Site icon

BEAUTY : మారుతీ టీమ్ ప్రొడక్ట్ నిర్మిస్తున్న ‘బ్యూటీ’ టీజర్ విడుదల

Beauty

Beauty

వానరా సెల్యులాయిడ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఆడియెన్స్‌ను మెప్పించబోతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బారిక్‌’ సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ను అందించేందుకు మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి బ్యూటీ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య మరియు నీలఖి పాత్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అందరిలోనూ ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘బ్యూటీ’ టీజర్ మరింతగా ఆసక్తిని పెంచేసింది. బ్యూటీ టీజర్ ఎంతో బ్యూటీఫుల్‌గా, ఎంతో ప్లెజెంట్‌గా ఉంది. ఓ అందమైన ప్రేమ కథతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ని కూడా చూపించబోతున్నారనిపిస్తోంది. ఈ టీజర్‌లో అంకిత్ కొయ్య, నీలఖి పాత్రలు.. తండ్రిగా నరేష్, తల్లిగా వాసుకి పాత్రల్ని కూడా చూపించారు. టీజర్ చూస్తుంటే ఓ స్కూటీ చుట్టూనే ఈ కథ తిరిగేలా ఉంది. స్కూటీ వచ్చాకా? ఏం జరుగుతుంది? అసలు హీరోయిన్ స్కూటీని ఎందుకు అడుగుతోంది..? ఆ స్కూటీ వచ్చాక హీరోయిన్‌లో వచ్చే మార్పులు ఏంటి? ఈ ప్రేమ కథలో ఎలాంటి ట్విస్టులు వస్తాయి.. అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను బ్యూటీఫుల్‌గా కట్ చేశారు. ఇక టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. ‘లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను’ అనే డైలాగ్‌కు సినిమాలో చాలానే ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది.

Also Read : Nidhhi Agerwal : బ్యూటిఫుల్ మేకోవర్ తో నిధి అగర్వాల్ ‘కొల్లగొట్టినాదిరో’