Site icon NTV Telugu

Actor Naresh : రానున్న రోజుల్లో జాగ్రత్త.. వైరల్ అవుతున్న నటుడి ట్వీట్

Whatsapp Image 2024 05 04 At 10.10.35 Am

Whatsapp Image 2024 05 04 At 10.10.35 Am

సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గతంలో హీరోగా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే నటుడు నరేష్ .అలాగే భావోద్వేగకరమైన సన్నివేశాలలో నరేష్ అద్భుతంగా నటించి మెప్పించగలరు.సీనియర్ నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన మెప్పించిన నరేష్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నరేష్ బాగా రానిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా ప్రాంతాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలను జాగ్రత్తగా ఉండాలి అంటూ నరేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా జాగ్రత్తలు తెలిపారు.అనేక ప్రాంతాలలో ఎండ తీవ్రత ఎక్కువగా వుంది.ప్రతి రోజు ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతుంది.మా క్యారవాన్స్ లోని ఏసిలు కూడా పని చేయడం లేదు.కొన్ని చిత్ర యూనిట్లు పెరుగుతున్న ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక షూటింగ్ లను రద్దు చేసుకుంటున్నాయి.జాగ్రత్తగా వుండండి మిత్రులారా రాబోయే రోజులు మరింత దారుణంగా ఉంటాయి .ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది.ఏదైనా ఇంపార్టెంట్ పనివుంటే తప్ప బయటకి రావొద్దు.నిరంతరం నీరు త్రాగుతూ మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి అని నరేష్ ట్వీట్ చేసారు .

Exit mobile version