NTV Telugu Site icon

జీ 5లో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’

Battala Ramaswamy Biopic to release on May 14

అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, మే 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కాబోతోంది. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నవ్విస్తుందని జీ5 ప్రతినిధులు చెబుతున్నారు. తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని సినిమా దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాతలు ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ ఐ, ‘మ్యాంగో మీడియా’ రామకృష్ణ వీరపనేని చెప్పారు. కథ విషయానికి వస్తే… రామస్వామికి జీవితంలో రెండంటే రెండే లక్ష్యాలు ఉంటాయి. ఒకటి… శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. రెండు… చీరల వ్యాపారం చక్కగా చేసుకోవాలి. కోరుకున్నట్టుగా… వీధుల్లో నగలు అమ్మే జయప్రదను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రామస్వామి.. అయితే, అనుకోని పరిస్థితుల్లో మరో ఇద్దరి మెడలో మూడు ముడులు వేస్తాడు. ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనే దానిని ఆసక్తికరంగా దర్శకుడు రామ్ నారాయణ తెరకెక్కించాడని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతాన్ని అందించారు.