నాగబాబు ఒరిజినల్స్ లో బస్తీ బోయ్స్ వెబ్ సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ అంటూ స్కిట్స్ చేసిన కుర్రాళ్లతో మెగాబ్రదర్ నాగబాబు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. బస్తీ బాయ్స్ అనేది టైటిల్. దీనికి ఆయనే కాన్సెప్ట్ అందించి ఇన్ఫినిటంతో కలిసి నిర్మిస్తున్నారు. ఓటీటీల్లో కాకుండా దీనిని నాగబాబు ఒరిజినల్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరం.
బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ గురించి నాగబాబు మాట్లాడుతూ సద్దాం-యాదమ్మ రాజు-భాస్కర్ - హరి (అదిరింది టీమ్) కలిస్తే కామెడీ బావుంటుందని ఆ నలుగురితో బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించాం. తాము ఇన్ఫినిటం తో కలిసి ఈ సిరీస్ తీస్తున్నాం. ఈ కంటెంట్ ఏ OTT కి వెళ్లినా డిమాండ్ బావుంటుంది. కాకపోతే ఇది అందరికి అందించాలనే ఉద్దేశంతో ఎలాంటి సబ్ స్క్రిప్షన్ చార్జెస్ లేకుండా నా యూ ట్యూబ్ ఛానెల్ అయిన `నాగబాబు ఒరిజినల్స్`లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సిరీస్ కి టీవీ లానే చాలా ఎక్కువ ఖర్చు చేసి తీసాం. సిరీస్ హిట్ అయితే మరిన్ని సీజన్స్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ సిరీస్ కి కాన్సెప్ట్ నేను బుల్లెట్ భాస్కర్ కలిసి తయారు చేసుకున్నాం. బుల్లెట్ భాస్కర్ డైరెక్ట్ చేసాడు అని చెప్పారు. ఈ సందర్భంగా సద్దాం- హరి- రాజు భాస్కర్ పై ప్రశంసలు కురిపించారు నాగబాబు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 27 సాయంత్రం 6 గంటల నుండి అందుబాటులో ఉంటుంది అని చెప్పారు.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
యాదమ్మ రాజు మాట్లాడుతూ-మేము ఖాళీగా ఉన్నప్పుడు నాగబాబు గారే పిలిచి 'అదిరింది' లో ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసారు. ఆ తరువాత కూడా నాగబాబు గారే మేము ఖాళీగా ఉండొద్దు అని మళ్ళీ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసారు. అందుకు మీకు థాంక్స్ సార్. ఈ వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చింది. అందరూ ఈ వెబ్ సిరీస్ చూసి ఎంకరేజ్ చెయ్యండి. అందరికి థాంక్యూ అన్నారు.
ఎక్స్ ప్రెస్ హరి మాట్లాడుతూ-ముందుగా మాకు ఈ బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్ ఇచ్చి సపోర్ట్ చేసిన నాగబాబు గారికి థాంక్స్. టాలెంట్ చాలా మందికి ఉంటుంది, కానీ దాన్ని గుర్తించి సపోర్ట్ చేసే వాళ్ళలో నాగబాబు గారు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. గతంలో మేము స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ స్కిట్స్ చేసాం... ఏడాదిగా ఆపేశాం...దాంతో చాలామంది గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ ఎక్కడ? వాళ్ళ కామెడీ ఎక్కడ అని అడిగారు. ఇప్పుడు చెబుతున్నా.. మీరు సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్న మీ కామెడీ ఆకలి తీర్చే ఫుల్ మీల్స్ మా బస్తీ బాయ్స్. మీరు ఎక్స్పెక్ట్ చేసినదానికంటే ఎక్కువ నవ్వుతారు. గల్లీ బాయ్స్ -డీ బాయ్స్ కి మించి కామెడీ మా బస్తీ బాయ్స్ లో చూస్తారు. అదిరింది టైమ్ లో స్కిట్స్ చేసాక సార్ ఇచ్చిన ఐడియాస్ బాగా హెల్ప్ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు నాగబాబు గారి హయాంలోనే చేసిన బస్తీ బాయ్స్ లో కామెడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. సార్ పిలిచి బస్తీ బాయ్స్ చేద్దాం అన్నప్పుడు నేను చాలా ఎక్సయిట్ అయ్యా. అలాంటిది షూటింగ్ అయ్యి, డబ్బింగ్ అయ్యి ఇప్పుడు చూసాక చెబుతున్నా...ఇది గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ ని మించి ఉంటుంది. ఎక్కడా తగ్గేదే లే...ఇది 8, 9 సిరీస్ వరకు వెళుతుంది.మా వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
పటాస్ భాస్కర్ మాట్లాడుతూ-థాంక్యూ సో మచ్ డాడీ...మేం నలుగురం 4 -5 ఇయర్స్ నుండి కలిసున్నాం. ఏడాది గ్యాప్ వచ్చింది. ఇక అయిపోయింది అనుకున్నవాళ్ళకి ఈ బస్తీ బాయ్స్ మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తుంది. మేం చేసే చిల్లర పనులన్నీ ఈ ఎపిసోడ్ లో ఉంటాయి. మేం షూటింగ్ లో చేసే పనులన్నీ ఈ వెబ్ సిరీస్ లో ఉంటాయి. ఇంట్లో ఎలా ఉంటామో, బయట ఎలా ఉంటామో ఈ సిరీస్ లో కూడా అలానే ఉంటాం. చేసేటప్పుడు మాకే అనిపించింది.బుల్లెట్ భాస్కర్ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటాడు. డైరెక్టర్ గా హెల్ప్ చేసిన బుల్లెట్ భాస్కర్ అన్నకి థాంక్స్ అన్నారు.
సద్దాం మాట్లాడుతూ-నాగబాబు సార్ కి థాంక్యూ. దీన్ని బయట ఎవరికి ఇచ్చినా కూడా మంచి అమౌంట్ వస్తుంది...కానీ అందరికి అందుబాటులో ఉండాలని ఫ్రీ గా రిలీజ్ చేస్తున్నారు. మీకు గల్లీ బాయ్స్ తెలుసు. రౌడీ బాయ్స్ తెలుసు...వాళ్లిద్దరూ కలిపితే ఈ బస్తీ బాయ్స్. ఇది మా నలుగురి కాంబినేషన్ లో చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్. మేం డబ్బింగ్ చెప్పేటప్పుడే చాలా నవ్వుకున్నాం. రిలీజ్ అయితే మీరు కూడా అలానే నవ్వుకుంటారు. మేం నలుగురం కలిస్తే మీ కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. ఈ సిరీస్ లో ఇంకా పేరు వస్తుంది అని ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటుంన్నాం అన్నారు.
తాజావార్తలు
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!