డార్క్ కామెడీ జోనర్‌లో రూపొందిన ‘మరణ మాస్’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ ప్రసాద్ దర్శకత్వం వహించారు. వ్యంగ్యం, సస్పెన్స్, అసంబద్ధతల మిళితంతో ఈ చిత్రం ఒక రోలర్‌కోస్టర్ అనుభవాన్ని అందిస్తుంది.
Shivraj Singh Chouhan: ఈసారి అలా చేస్తే పాక్ ప్రపంచ పటంలో ఉండదు
కథలో వాస్తవం అస్పష్టంగా మారినప్పుడు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది: ఇదంతా నిజమా, లేక ఎవరో దీన్ని పెద్దదిగా చిత్రీకరిస్తున్నారా? కేరళ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, ఒక హత్యను చూసినట్లు భావించే ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. స్థానిక రాజకీయాలు, దాగిన ఎజెండాలు, అనూహ్య సంఘటనలు కథలో వెలుగులోకి వస్తాయి.
ఈ సందర్భంగా బాసిల్ జోసెఫ్ మాట్లాడుతూ, “‘మరణ మాస్’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వైవిధ్యమైన హాస్యం, పాత్రలు, అనూహ్య ట్విస్టులు దీన్ని ప్రత్యేకమైన అనుభవంగా మారుస్తాయి. గతంలో సోనీ లివ్‌లో నా చిత్రం ‘ప్రవీణ్‌కూడు షప్పు’కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంతో ఈ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.
