Site icon NTV Telugu

Bandla Ganesh: దిల్ రాజు ప్రెస్ మీట్ సమయంలో బండ్ల గణేష్ సంచలన ట్వీట్

Bandla Ganesh

Bandla Ganesh

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ ప్రకటన కలకలం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా నిర్మాతలు బయటకు వచ్చి ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిన్న అల్లు అరవింద్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తనకు తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉందని ఆంధ్ర ప్రదేశ్ లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ నలుగురు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఆ నలుగురిలో తాను లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు.

Also Read: Dil Raju: పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు

తనకు తెలంగాణలో కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని ఆయన కామెంట్ చేశారు. మొత్తం 370 థియేటర్లలో 120 థియేటర్లు మాత్రమే ఏషియన్ సునీల్, సురేష్ బాబు దిల్ రాజు వర్గం ఆధీనంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాక పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని కామెంట్ చేసిన ఆయన ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగిందని, అలా సద్దుమడగడానికి సహకరించిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి థాంక్స్ కూడా చెప్పారు.

Also Read:Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!

అయితే సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే మరో నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కలకలం రేపుతుంది. ఆస్కార్ నటులు, కమల్ హాసన్లు ఎక్కువైపోయారు, వీళ్ళ నటన చూడలేకపోతున్నాం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎవరి గురించి ట్వీట్ చేశారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సరిగ్గా దిల్ రోజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన దిల్ రాజుని ఉద్దేశించే ట్వీట్ చేశారేమో అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Exit mobile version