ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా సోకిన కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల క్రితం రెండవ సారి కరోనా బారిన పడ్డ బండ్ల గణేష్ ఆరోగ్యం క్రిటికల్ గా మారడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇటీవలే ఆయనను ఐసీయూ నుంచి చికిత్స నిమిత్తం ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బండ్ల గణేష్ ఇప్పుడు చికిత్సకు బాగా స్పందిస్తున్నారని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. కాగా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి హాజరైన తర్వాత కోవిడ్ -19 బారిన పడ్డాడు బండ్ల గణేష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
నిలకడగా బండ్ల గణేష్ ఆరోగ్యం
