NTV Telugu Site icon

పవర్ స్టార్ పేరు మార్చేసిన బండ్ల గణేష్

Bandla Ganesh

Bandla Ganesh

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తాను దేవుడిగా కొలిచే అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మార్చేశారు. ఇప్పటివరకూ పలు ఈవెంట్లలో ఆయనను దేవుడిగా పిలిచిన, కొలిచిన ఈ నిర్మాత తాజాగా తన భక్తిని మరోసారి చాటుకున్నాడు. పవన్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకున్న ఆయన ఇప్పటి నుంచి తన దేవుడిని “దేవర” అని పిలుస్తానని వెల్లడించాడు. ఈ మేరకు “నా దేవర తో నేను… భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని ‘దేవర’ అని పిలుస్తాను” అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు తాను అయ్యప్ప స్వామి మాలలో ఉండగా పవన్ తో దిగిన పిక్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక మెగా అభిమానులు బండ్ల ట్వీట్ ను తెగ షేర్లు చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : మోస్ట్ అవైటెడ్ మూవీ “కబ్జా” మోషన్ పోస్టర్

ఇక కమెడియన్ నుంచి నిర్మాతగా మారిన బండ్ల ఆ తరువాత రాజకీయ నాయకుడిగా టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ లోకి అడుగు పెట్టిన ఆయన కాంగ్రెస్ గనుక అధికారంలోకి రాకపోతే ‘బ్లేడ్’తో పీక కోసుకుంటాను అంటూ కామెంట్స్ చేసి రచ్చ చేశారు. ఆ తరువాత తనకు రాజకీయాలు అంతగా కలిసిరావని చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే మహేష్ బాబు “సర్కారు వారి పాట”ను నిర్మించిన బండ్ల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “గబ్బర్ సింగ్”కు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.