సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్, చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మీడియాతో ముచ్చటించారు. అందులోని బుల్లెట్ పాయింట్స్ మీ కోసం
1 – అడవిలో తప్పిపోయిన పిల్లాడు ఏడేళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రులను కలిసినట్టు ఉంది ఈ రోజు ప్రెస్ మీట్
2 – ఈ సారి పవన్ తో సినిమా చేస్తే 200 శాతం గబ్బర్‌సింగ్ స్థాయి చిత్రం చేయకపోతే నా పేరు బండ్ల గణేశ్ కాదు.
3 – ఇక నుండి మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నా. చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా విజయాన్ని అందుకునే చిత్రాలు చేయాలని ఉంది.
4 – మా దర్శకుడు హరీశ్ – బండ్ల గణేశ్ కాంబోలో ఓ సినిమా చేసే అవకాశం ఇవ్వమని మీడియా ద్వారా అడుగుతున్నా. అవకాశం ఇస్తే చరిత్రలో నిలిచిపోయే సినిమా చేస్తా.
5 – పవన్ సినిమాలు చేయకపోవడాన్ని నేను అంగీకరించను. ఆయన సినిమాలు చేయాల్సిందే. ఆయనకు ఆదాయం వచ్చేది సినిమాతోనే. ఆయన ఏ పదవిలో ఉన్నా సమయం చూసుకుని మాలాంటి అభిమానుల కోసం సినిమాలు చేయాలి.
6 – జనసేనలో చేరతారా అన్న ప్రశ్నకు బదులుగా.. నా రక్తంలో కాంగ్రెస్ ఉంది. రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్‌లోనే ఉంటా. లేదంటే రాజకీయాలు వదిలేసి సినిమాలు తీస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నా.
7 – N కన్వెన్షన్ ఘటనపై స్పందిస్తూ ముఖ్యమంత్రి సోదరుడి ఇంటికే నోటీసులు ఇచ్చారు. నన్ను ఏమీ చేయమంటావు. నా ఇల్లు కూడా చెక్ చేసి అక్రమ నిర్మాణం అని తేలితే కూల్చుతారు. దానికి నేను ఏం చేస్తా.
8 – హరీష్ శంకర్ నా దగ్గరికి వస్తే రాబోయే 25 ఏళ్లు NO.1 డైరక్టర్ గా ఉంటాడు.
9 – మా పవన్ ఫాన్స్ ఇంతక ముందులాగా కాదు.. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు.. దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి.. సెప్టెంబర్ 2న ఉదయం గుడికి వెళ్తారు.. 11గంటలకి థియేటర్ వెళ్తారు
10 – భగవంతుడు లిమిటెడ్ ఎడిషన్స్ కొన్ని తయారు చేస్తాడు. ఒక చిరంజీవి,పవన్ కళ్యాణ్ ఒక మోడీ వాళ్ళని పూజించాలి ప్రేమించాలి అంతే గానీ వాళ్ళని మనలా అనుకుంటే మనకంటే ఎర్రిపు… ఇంకోడు ఉండడు అని ప్రెస్ మీట్ ముగించాడు బండ్ల