Site icon NTV Telugu

Telangana : రాష్ట్రంలో రెండు వారాలు ఆ థియేటర్స్ బంద్..

Whatsapp Image 2024 05 15 At 11.22.05 Am

Whatsapp Image 2024 05 15 At 11.22.05 Am

Telangana : రాష్ట్రంలో మే 17వ తేదీ నుంచి ఆ థియేటర్స్ మూత పడనున్నాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మూసివేయనున్నట్లు తెలంగాణ థియేటర్స్ యజమానులు ప్రకటించారు.ప్రస్తుతం వేసవి మొదలైంది..స్కూల్స్ కి హాలిడేస్ కూడా ఇవ్వడంతో పిల్లలు ,పెద్దలు సినిమాలు చూడటానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు.కానీ వేసవి సెలవుల్లో ఎలాంటి పెద్ద సినిమాలు థియేటర్స్ కు రాలేదు.దీనికి కారణం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రభావం అని చెప్పొచ్చు.దీంతో కొత్త సినిమాల విడుదల తేదీలను మేకర్స్ వాయిదా వేసుకున్నారు.

అంతేకాకుండా ఈ సారి చిన్న సినిమాలు కూడా అంతగా విడుదల కాకపోవడంతో సింగిల్ ధియేటర్లలో సినిమాలు అంతగా పడటం లేదు.పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ కొన్ని చిన్న సినిమాలను రిలీజ్ చేస్తూ ఎలాగోలా రన్ చేస్తున్నారు.కానీ రిలీజ్ అయిన చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతగా లభించటం లేదు. దీనితో ధియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదు..అలాగే మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో థియేటర్స్ మూసివేయాలని మేకర్స్ నిర్ణయించారు..ఈ శుక్రవారం నుంచి రెండు వారాల పాటు షోలు వేయొద్దని తెలంగాణ థియేటర్ అసోసియేషన్ నిర్ణయించింది.

Exit mobile version