మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికకు సంబంధించి మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కథానాయికగా నటించేందుకు మొదట మలయాళ ముద్దుగుమ్మ వీరసింహారెడ్డిలో బాలయ్యతో చిందులేసిన హానీ రోజ్ ను తీసుకున్నారు. ఈ పాత్ర కోసం ఆమెకు భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ కూడా అప్పజెప్పారు. అయితే కొన్ని అనుకోని కారణాల వలన హానీ రోజ్ ఈ సినిమా నుండి వైదొలిగింది. ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే కాకుండా తాను తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునరేషన్‌ను కూడా మేకర్స్‌కు తిరిగి ఇచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. హానీ రోజ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో చిరంజీవి సరసన పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే హీరోయిన్ కోసం పలువురు పేర్లు పరిశీలించి చివరికి కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న రచిత రామ్ ను ఫైనల్ చేశారు. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు మెగాస్టార్ సరసన లక్కీ ఛాన్స్ అందుకోవడం విశేషం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ – చిరు కాంబోలో వస్తున్న ఈ క్రేజీ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో శరవేగంగా జరుగుతోంది.

