NTV Telugu Site icon

NBK 109 : ఎట్టకేలకు మూవీ సెట్ లోకి అడుగు పెట్టిన బాలయ్య.. ఇక మాస్ జాతరే..

Nbk 109 (1)

Nbk 109 (1)

NBK 109 : నందమూరి నటసింహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ,సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.ఇదిలా ఉంటే ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుండి టైటిల్ ను అనౌన్స్ చేస్తారేమో అని భావించారు.కానీ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ప్రేక్షకులకు సర్ప్రైజ్ అందించారు.

Read Also :Ramcharan : క్లింకారా కు తినిపిస్తుంటే నాలో సూపర్ పవర్స్ వచ్చేస్తాయి..

ఇదిలా ఉంటే మొన్నటి వరకు రాజకీయాలలో బిజీ గా వున్నా బాలయ్య సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు.తాజాగా బాలయ్య మరోసారి “NBK 109 “షూటింగ్ సెట్స్లోకి అడుగు పెట్టారు.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి కాగా మరో నెల రోజుల షూటింగ్ తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి అవుతుంది.అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరేట్ దర్శకుడు బోయపాటి డైరెక్షన్లో నటిస్తున్నాడు.”BB4 “అంటూ ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేసారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది.

Show comments