నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నందమూరి బాలకృష్ణకు ఎలివేషన్స్ బాగా కుదిరాయని బాబీ డైరెక్షన్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ భామ ఊర్వశితో కలిసి చేసిన డాన్స్ మీద అనేక ట్రోల్స్ నడిచాయి. దబిడి దిబిడే అనే ఒక సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేయగా ఆ స్టెప్స్ ఏంటి అసభ్యకరంగా ఉన్నాయి అంటూ ట్రోలింగ్ నడిచింది.
Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి ముగ్గుల పోటీలు.. పాల్గొన్న అందరికీ రూ.10,116 బహుమతి..
అయితే అదంతా ఒకప్పటి మాట సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో నిన్న రాత్రి సినిమా టీం పార్టీ చేసుకుంది. ఇక ఈ పార్టీలో ఊర్వశితో కలిసి నందమూరి బాలకృష్ణ అదే సాంగ్ కి స్టెప్పులు వేశారు. అయితే మొన్న ఊర్వశి వెనుక వైపు నుంచి బాలకృష్ణ స్టెప్పులు వేయగా ఈసారి ముందుకు వచ్చి స్టెప్పులు వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఊర్వశి ఆ వీడియోని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో బాలకృష్ణ ఆమెతో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయిన బాలయ్యతో మాత్రం దబిడి దిబిడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.