నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5 జరగాల్సిన పూజా కార్యక్రమం వాయిదా పడింది. అయితే సడెన్ గా వాయిదా వేయడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
ప్రశాంత్ వర్మతో పాటు మోక్షు డిసెంబరు 4న సినిమా గురించి డిస్కషన్స్ కూడా చేసుకుని తీరా ఇంటికి వెళ్ళాక నేను రెడీ గా లేను వాయిదా వేయండి అన్నారు అని కొందరు, ప్రశాంత్ వర్మ ఇప్పటికి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయలేదని అందుకే వాయిదా వేశారని అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వార్తలు వండి వార్చారు. దీంతో పాటు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను పక్కన పెట్టేసాడని ప్రభాస్ సినిమాను రెడీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని టాక్ వినిపించింది. అయితే ఈ రూమర్స్ పై మోక్షు తండ్రి నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మోక్షు సినిమాను గురువారం స్టార్ట్ చేయాలి కానీ అనివార్య కారణాల వలన మోక్షుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో వాయిదా వేయడం జరిగింది. రెండు రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు ఓపెనింగ్ డే రికవరీ అవుతాడని అనుకున్నాం కానీ అవలేదు అందుకే వాయిదా వేశాం. మరొక మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాం. నందమూరి అభిమానులు అశీసులతో మోక్షజ్ఞ ఎంట్రీ తప్పక ఉంటుంది’ అని అన్నారు.
#Mokshagna సినిమా ఇవ్వాళ మొదలు పెట్టాల్సింది కానీ.. అందుకే వాయిదా వేశాం – #NandamuriBalakrishna pic.twitter.com/ImE571tz5a
— Rajesh Manne (@rajeshmanne1) December 5, 2024