గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వరుస సినిమాలతో జోరు మీదున్నారు. బలయ్య క్రేజ్ అఖండ కు ముందు వేరు ఆ తర్వాత వేరు. కంటిన్యూగా నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ సినిమాలతో సీనియర్ హీరోలలో మరే హీరో అందుకోలేని రికార్డును బాలయ్య నమోదు చేసాడు. లేటెస్ట్ డాకు ఇప్పటికే రూ. 150 కోట్లు దాటి వసూళ్లు రాబడుతోంది. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ.
Also Read : Sankranthiki Vasthunam : ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్స్.. సింగిల్ హ్యాండ్ వెంకీ మామ
కాగా బాలయ్య ప్రస్తుతం అఖండ -2 షూటింగ్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత బాలయ్య నటించబోయే సినిమాపై టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. బాలయ్య కెరీర్ లో 111 వ సినిమాగారానున్న ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే అందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు గోపీచంద్. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక హీరొయిన్స్ గా తమిళ స్టార్ కథానాయకి త్రిష అలాగే మాళవిక మోహన్ ను ఎంపిక చేశారట.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. బాలయ్య హీరోయిజానికి అనిరుధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్లు బ్లాస్ట్ అవడం ఖాయం అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఈ సెన్సేషన్ కాంబో గురించి అధికారక ప్రకటన రానుందని సమాచారం.