మే 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును జరుపుకున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు నిన్న పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు #HappyBirthdayNBK, #AkhandaBirthdayRoar అనే హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ చేశారు కూడా. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ అప్డేట్స్ విడుదల చేసి నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఇక తాజాగా బాలకృష్ణ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మీయులకు, సినీ కళాకారులకు, సహచరులకు. కార్యకర్తలకు, హిందూపురం ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచం నలుదిక్కుల ఉన్న అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడూ నా ముఞ్చి కోరే మీరు ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు మీకు కలగాలని కోరుకుంటూ… మీ నందమూరి బాలకృష్ణ” అంటూ ఓ థాంక్స్ నోట్ ను విడుదల చేశారు.
అభిమానులకు బాలయ్య ధన్యవాదాలు
