Balakrishna : మీరు ఊహించిన దానికంటే మించే ఈ సినిమా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుక రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా, ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్న గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాను. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే అప్పట్లో ‘ఆదిత్య 369’లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ ‘డాకు మహారాజ్’ కథ పుట్టింది. ఈరోజు విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది.
Bobby : అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా పడతానన్నారు!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్టుగా, కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు తన అద్భుత పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో తీసుకున్నాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది. మూడు వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న ‘డాకు మహారాజ్’తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది. ఇక ముందు కూడా ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తున్నాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ విజయం సాధించాయి. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఊహించిన దానికంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు.” అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..