Site icon NTV Telugu

Balakrishna: నాకు, నా భార్యకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారా!.. బాలకృష్ణ ఫన్నీ కామెంట్స్

Balakrishna 2 1200x800

Balakrishna 2 1200x800

Balakrishna Funny Comments about his Wife: తాజాగా నందమూరి బాలకృష్ణ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ని నందమూరి బాలకృష్ణ హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణను మీరు ఎప్పుడైనా మీ భార్యకు చీర కొనుగోలు చేసి తీసుకుని వెళ్లారా అని ప్రశ్నించారు. దానికి నందమూరి బాలకృష్ణ ఫన్నీగా మాట్లాడుతూ ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? పుల్లలు పెట్టడం అవసరమా అన్నట్టు మాట్లాడారు. దీంతో అక్కడ పరిస్థితి అంతా ఒక్కసారిగా నవ్వుల మయమైంది.

Devara: దేవర కలెక్షన్స్.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నందమూరి బాలకృష్ణకు 1982లో వసుంధర దేవితో ఘనంగా వివాహం జరిగింది. కాకినాడకు చెందిన ఎస్సార్ ఎంటి ట్రాన్స్పోర్ట్ అధినేత కుమార్తె అయిన వసుంధర బాలకృష్ణ దంపతులకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని కాగా కుమారుడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఉండబోతోంది. ఇప్పటికి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Exit mobile version