Site icon NTV Telugu

BB 5: బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా.. 10 రోజుల్లో ప్రకటన?

Balakrishna Boyapati

Balakrishna Boyapati

టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ తాండవం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ‘BB5’ (బాలకృష్ణ-బోయపాటి 5వ సినిమా) గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Also Read: Sunny Leone : న్యూఇయర్ ట్రీట్’కి రెడీ అయిన సన్నీ

ఈ క్రేజీ కాంబినేషన్‌ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగింది. వాస్తవానికి, అల్లు అరవింద్ గారి నిర్మాణంలో బాలయ్య ఒక సినిమా చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు ఓకే అవ్వడం విశేషం. బోయపాటి శ్రీను గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమాలు చేయడానికి అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ హీరోలకు కథలు వినిపించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. తాజాగా, బాలయ్య బాబుతో ‘BB5’ను పట్టాలెక్కించడం ద్వారా బోయపాటి తన పాత కమిట్మెంట్ నెరవేర్చుకోబోతున్నారు అని అంటున్నారు. నిజానికి అఖండ తాండవం అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నారు. బోయపాటి తన తదుపరి సినిమా మరో 10 రోజుల్లో అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించారు.

Also Read: Sandalwood : షాకింగ్.. నటిని కిడ్నాప్ చేసిన నిర్మాత?

ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ ముందస్తు ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2027లో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘అఖండ తాండవం’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయోనని ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. అయితే అది అఖండ 3 అవుతుందా లేక వేరే సినిమా అవుతుందా ? అనేది చూడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్, బోయపాటి వంటి మాస్ డైరెక్టర్, బాలయ్య వంటి పవర్‌ఫుల్ హీరో కలిస్తే బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం. 2027 కోసం నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే క్యాలెండర్ వైపు చూస్తున్నారు.

Exit mobile version