ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో భారీ హిట్ ను అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘క్రాక్’ కోవిడ్ సమయంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేనికి నిర్మాతల నుంచి, హీరోల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం… ఈ చిత్రం షూటింగ్ మే నెలలోనే ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈ చిత్రం కాస్త ఆలస్యంగా జూన్ లో లాంఛనంగా ప్రారంభమవుతుందని, జూలై మధ్యలో నుండి షూటింగ్ ప్రారంభమవుతుందనితెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోపు బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘అఖండ’లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది రాబోయే నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆలస్యంగా బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీ …?
