NTV Telugu Site icon

Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు

Nithin

Nithin

బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాదికి పైగా అవుతోంది. కానీ ఇప్పటికి రెండవ సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ సినిమా చేసేలా అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు.

Also Read : Pan – India Film : మైత్రీ మూవీస్ వారి భారీ పాన్ ఇండియా సినిమా.!

ఈ సినిమా ఓ కథ రెడీ చేసుకున్నాడు వేణు. నిర్మాత దిల్ రాజు కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వీరికి ఓ హీరో కావాలి ఆ నేపద్యంలో పలువురు టాలీవుడ్ హీరోలకు కథ వినిపించారు. కానీ ఎక్కడ మెటీరిలైజ్ అవలేదు. అందరి చుట్టూ తిరిగి ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చి చేరింది. పలు మార్పులతో మొత్తానికి ఈ సినిమా ఓకే అయింది. ఈ కథకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఫినిష్ చేసాక వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

Show comments