విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలెప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి సినిమాలే ఇష్టపడుతున్నారు. అందుకే చిన్న దర్శకులు, నటినటులు పల్లెటూరి బాట పడుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి గ్రామీణ నైపద్యలో లోనే ‘బద్మాషులు’ అనే మూవీ రాబోతుంది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటించగా, ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించాడు. B. బాలకృష్ణ, C.రామ శంకర్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో హాస్య భరితంగా ఉండబోతుంది . ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుంటూ ఆ అనుభూతిని నలుగురు పంచుకునే చిత్రం ఇది. కథ పరంగా నవ్విస్తూనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇక తాజాగా ఈ ‘బద్మాషులు’ నుంచి టీజర్ రిలీజ్ చేసింది.
Also Read:Kiran: టాలీవుడ్ యంగ్ హీరో సినిమా వాయిదా..!
ఇక ఈ టీజర్ చూస్తుంటే కనుక ప్రతి ఒక సీన్ ఎంటర్టైన్మెంట్ తో నింపేశారు. ప్రతి ఒక క్యారెక్టర్ కామెడీ టైమింగ్ అదుర్స్ అని చెప్పాలి. ప్రోఫెషనల్ కమెడియన్ మించి హాస్యం పండించారు. నిజంగా వారిని చూస్తుంటే కథలో మనం కూడా ఉన్న ఫీల్ వస్తుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రతి ఒక విలేజ్‌లో ఉంటారు. ఇక టీజర్ ఏ ఈ మాత్రం ఉంటే ఫుల్ మూవీ ఇంకెలా ఉంటుందో. అయితే ఈ మూవీ అలరించడం తో పాటుగా.. మంచి సందేశాన్ని కూడా అందిస్తుందట. తేజ కూనూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.