Site icon NTV Telugu

OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. OG ప్రీమియర్స్ క్యాన్సిల్

Og (2)

Og (2)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). ఫ్యాన్ బాయ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Also Read : Madharaasi : శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ స్టీమింగ్ డేట్ ఇదే..

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఒకటే హైప్ అదే OG. రిలీజ్ కు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచారు మేకర్స్. ప్రియాంక మోహన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా OG రిలీజ్ ను భారీ స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా సెలెబ్రేట్ చేయాలనుకున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్తోంది యూనిట్. టాలీవుడ్ లో ఇటీవల సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేసే ట్రెండ్ నడుస్తోంది. అలానే OG కి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు అనగా 24న ప్రీమియర్స్ వేస్తె బాగుండని ఫ్యాన్స్ భావించారు. కానీ స్పెషల్ ప్రీమియర్స్ లేవని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ 25న రిలీజ్ నుండి తెల్లవారుజామున అర్ధరాత్రి 1 గంటకు అలాగే 4 గంటలకు స్పెషల్ షోస్ ను ప్రాదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓజి రిలీజ్ రోజు థియేటర్స్ దద్దరిల్లడం మాత్రం ఖాయం అనే చెప్పాలి.

Exit mobile version