Bad Girlz: ఆసక్తికరంగా బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
అయితే దర్శకుడు మారుతి ట్రైలర్ ను విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది, ప్రామిసింగ్ గా అనిపించింది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) నాకు చిరకాల మిత్రుడు, ఇండస్ట్రీ లో సాధు జీవి, మంచి సంగీత జ్ఞానం ఉన్నవాడు. తన మొదటి చిత్రం లోని నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం తో మన ముందుకు వస్తున్నాడు. ఒక మంచి విషయాన్ని కొత్త గా చెప్పడానికి ప్రయత్నం చేసాడు . ఒక ఐదుగురు కొత్త అమ్మాయిలతో సినిమా చేయడం, ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా ని పూర్తి చేయడం తన ప్యాషన్ కి నిదర్శనం. సినిమా టైటిల్ మాత్రానే ‘బ్యాడ్ గాళ్స్’ కానీ సినిమా అంతా పాజిటివ్ గా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదల అవుతుంది, అందరు కష్టపడి పనిచేసారు. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు, ఆడవారికి ఇంపార్టెంట్ ఇచ్చే సినిమా తప్పక ఆడాలి. ఈనాటి ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో తీసిన చిత్రం ఇది. తప్పక చూడండి, ఈ ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రాన్ని ఆదరించండి” అని తెలిపారు.
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
తాజావార్తలు
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!