Site icon NTV Telugu

Bad Girl : ఎట్టకేలకు ‘బ్యాడ్ గర్ల్’ కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్!

Bad Girl Movie

Bad Girl Movie

తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రానికి చివరికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు బోల్డ్ కాన్సెప్ట్, మరోవైపు సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ చిత్రానికి ఎట్టకేలకి విడుదల దారులు తెరుచుకున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ మేధావి వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వర్షా భరత్ దర్శకత్వం వహించారు. కథానాయికగా అంజలి శివరామన్ నటిస్తోంది.

Also Read : War 2 : ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ – కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డు ఈ చిత్రం పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొందరు దృశ్యాలు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయని భావించడంతో, బోర్డు కొన్ని కట్‌లు సూచించింది. అయితే నిర్మాతలు ఆ కట్‌లకు అంగీకరించకపోవడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. చివరికి వెట్రిమారన్ సాక్షాత్తు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయినప్పటికీ చిత్ర బృందం మరియు సెన్సార్ బోర్డు మధ్య ఓ మైలు రాయిగా మూడోసారి సెటిల్‌మెంట్ కుదరడంతో, బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. కాగా ఈ వివాదాలు దాటుకొని, ఈ సినిమా, 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది అని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. సోషల్ మీడియాలో ఒక పోస్టర్ విడుదల చేసింది. ‘అన్ని అడ్డంకులు అధిగమించారు – ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. ఇక ఇని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘బ్యాడ్ గర్ల్’ చివరకు థియేటర్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమ అనే అంశాలపై కొత్త దృష్టికోణాన్ని చూపుతుందా? సెప్టెంబర్ 5న చూసి తేల్చుకోవాల్సింది.

ఈ చిత్రం కథలో ఓ బాలిక తన టీనేజ్ దశ నుంచే తనకు బాయ్‌ఫ్రెండ్ కావాలని కోరిక పెంచుకుంటుంది. కానీ, సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె, తన స్వేచ్ఛను ఎలా సాధించుకుంది? తన ఇష్టాన్ని ఎలా నిలబెట్టుకుంది? అలా చేసే క్రమంలో ఎదురైన సంఘటనలు ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఇది సోషియో-ఎమోషనల్ డ్రామా గా భావిస్తున్నారు.

Exit mobile version