Site icon NTV Telugu

సినిమా బండి : ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్

Baavilona Kappa Song Lyrical Video from Cinema Bandi

ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పై ప్రశంసలు వర్షం కురిసింది. ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి, అతను తన గ్రామ పరిస్థితిని మెరుగుపరిచేందుకు మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రైలర్ లోని సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను చక్కిలిగింతలు పెట్టేశాయి. డి 2 ఆర్ ఇండీ బ్యానర్‌లో రాజ్, డికె ద్వయం ఈ చిత్రాన్ని నిర్మించారు. వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర, ముని వెంకటప్ప, ఉమా జి, సిరివెన్నెల యనమంధల, సింధు శ్రీనివాసమూర్తి, పూజారి రామ్ చరణ్, దవని ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సిరిష్ సత్యవోలు సంగీతం సమకూర్చారు. తాజాగా ‘సినిమా బండి’ నుంచి ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సినిమాకు సంగీతం అందించిన సత్యవోలు స్వయంగా ఈ సాంగ్ లిరిక్స్ రాసి, థానే పాడడం విశేషం. అందరినీ ఆకట్టుకుంటున్న ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

https://www.youtube.com/watch?v=Ip4Yb3dpih0
Exit mobile version