Site icon NTV Telugu

Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..

Baahubali Theepic

Baahubali Theepic

ప్రభాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో రూపొందిన  ‘బాహుబ‌లి’ మూవీ రెండు భాగాలుగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబ‌ట్టింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాహుబ‌లి సినిమాల రీరిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ప‌లు సంద‌ర్భాల‌లో ఫ్యాన్స్ త‌మ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అయితే  భారత సినీ చరిత్రలో ఓ అద్భుతం, ఓ మైలురాయి‌గా నిలిచిన చిత్రం ‘బాహుబలి’ నేటికి పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సోషల్ మీడియాలో భావోద్వేగ భరితంగా స్పందించారు.. “బాహుబలి.. ఎన్నో ప్రయాణాలకు నాంది. మరెన్నో మధుర జ్ఞాపకాలు. ఎంతో మందికి స్ఫూర్తి” అని ఆయన పేర్కొన్నారు.. అలాగే ఫ్యాన్స్ గుడ్ న్యూస్ కూడా తెలిపారు ఏంటీ అంటే..

Also Read : R Madhavan : వయసు కాదు.. కెమిస్ట్రీ ముఖ్యం

‘ ‘బాహుబలి’.. సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. రెండు భాగాలుగా అలరించిన బాహుబలి ఇప్పుడు ఒకే పార్ట్ గా మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘బాహుబలి: ది ఎపిక్ (Baahubali The Epic) పేరుతో ఇది రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని పోస్ట్ పెట్టారు. అది కూడా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మరోసారి చరిత్ర సృష్టించి.. రీ రిలీజ్ లో రికార్డు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ స్పెషల్ సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ ‘బాహుబలి – ది ఎపిక్’ అనే కొత్త టైటిల్‌తో ఈ చిత్రాన్నికి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు.

Exit mobile version