జూన్ 13 అంటే ఈరోజు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ దిశాకు హృదయపూర్వకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “అందరూ దిశా గ్లామరస్ సైడ్ ను ఇష్టపడతారు. కానీ నేను గ్లామర్ కు అటువైపున్న దిశాను ఇష్టపడతాను” అంటూ దిశా లేగ దూడతో ఉన్న లవ్లీ పిక్ ను షేర్ చేశారు అయేషా. కొంతకాలంగా దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటి వరకూ బహిరంగంగా మాట్లాడలేదు.
A post shared by Ayesha Shroff (@ayeshashroff)