బాలనటిగా ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది అవికా గోర్ (Avika Gor). ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారింది. అయితే, ప్రేక్షకుల ముందే చిన్నపిల్ల వయసు నుండి హీరోయిన్ స్టేజ్ వరకు ఎదిగిన ఈ ముద్దుగుమ్మపై గత కొంతకాలంగా ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్ ఈ రూమర్లపై ఓపెన్‌గా స్పందించి గట్టి క్లారిటీ ఇచ్చారు.
ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ (Ugly Story) చిత్రంతో అలరించిన అవికా.. ‘నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వాస్తవమే. కానీ, అది అందం కోసం కాదు.. కేవలం నా ముఖంపై ఉన్న పింపుల్స్ (మొటిమలు) తొలగించుకోవడానికి మాత్రమే. దురదృష్టవశాత్తూ అది కూడా సరిగా పనిచేయలేదు. ఒక నటిగా స్క్రీన్‌పై అందంగా కనిపించడం ముఖ్యం కాబట్టి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు పార్లర్‌కు వెళ్లి బ్లడ్ సెల్స్ క్లీనింగ్, బైఫిషియల్ లాంటివి చేయించుకునేదాన్ని తప్ప సర్జరీలు కాదు. నాకు 7 ఏళ్ల వయసున్నప్పటి నుండే మేకప్ వేసుకోవడం అలవాటైంది. నా చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడతాను. చిన్న టాటూ వేయించుకోవాలన్నా, కనీసం హెయిర్ కట్ (జుట్టు కత్తిరించుకోవడం) చేయించుకున్నా అమ్మ పర్మిషన్ కావాలి..అలాంటిది పెద్ద కాస్మోటిక్ సర్జరీలు ఎలా చేయించుకోగలను?’ అని అవికా ప్రశ్నించింది. అలాగే
‘నా శరీరం తత్వం ఏంటంటే.. చాలా త్వరగా బరువు పెరుగుతాను, అంతే వేగంగా బరువు తగ్గుతాను. షూటింగ్స్ లేకపోతే తినడమే పనిగా పెట్టుకుంటాను. వయసు పెరిగే కొద్దీ అమ్మాయిల శరీరంలో సహజంగానే మార్పులు వస్తాయి. కానీ, నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న జనాలకు ఆ మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకుని వదంతులు సృష్టించారు. కానీ సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే వంటి వారు తమ బాడీని ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంచుకుంటారో చూసి తాను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యానని, వారిలాగే తాను కూడా కాస్త కష్టమైనా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ బరువు తగ్గా’ అని అవికా గోర్ పేర్కొంది.
