Mugguru Kotulu : ‘ముగ్గురు కోతుల’ చిల్లర సాంగ్

Chillara Song

Chillara Song

సోషల్ మీడియాలో తనదైన స్టైల్, స్వాగ్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ‘యాటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్.. ఇప్పుడు ఒక క్రేజీ సాంగ్‌ను లాంచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అసలే సినిమా పేరు ‘ముగ్గురు కోతులు’.. ఆపై రిలీజ్ చేసిన పాట పేరు ‘చిల్లర సాంగ్’.. ఈ క్యాచీ అండ్ క్వర్కీ కాంబినేషన్‌కి ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ తోడవడంతో ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాయి. యూత్‌ను ఆకట్టుకునే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘ముగ్గురు కోతులు’ చిత్రానికి కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చంద్రహాస్ చేతుల మీదుగా లాంచ్ అయిన ‘చిల్లర సాంగ్’ ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎస్. సుహాస్ ఈ పాటకు క్యాచీ ట్యూన్ అందించడమే కాకుండా, తన గొంతుతో మ్యాజిక్ చేశారు.

గణేష్ బొడ్డ, సుహాస్ సంయుక్తంగా అందించిన లిరిక్స్ నేటితరం యువతకు ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇక లిరికల్ వీడియోలో ముగ్గురు హీరోలు సరదాగా చిల్ అవుతూ చేసే అల్లరి ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. పాటను విడుదల చేసిన అనంతరం చిత్రబృందానికి చంద్రహాస్ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహకారంతో శోభారాణి గరిమెల్ల ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా మెరుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.