Tunnel Movie : ఒక్క రాత్రిలోనే ‘టన్నెల్’ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో అథర్వ మురళీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా రవీంద్ర మాధవ తెరకెక్కించిన చిత్రం ‘టన్నెల్’. ఈ మూవీని తెలుగులోbలచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ. రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఎ. రాజు నాయక్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..
‘టన్నెల్’ మూవీని చూశారా?
‘టన్నెల్’ మూవీని చెన్నైలో చూశాను. టీజర్, ట్రైలర్ వచ్చిన తరువాత ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. కథ కొత్తగా ఉంది కదా? అని ఇలాంటి సినిమాను తెలుగు వారికి అందించాలని అనుకున్నాను. అందుకే చెన్నైకి వెళ్లి ప్రత్యేకంగా సినిమాను వీక్షించాను. నాకు చిత్రం విపరీతంగా నచ్చింది. అందుకే తెలుగులోకి తీసుకు వస్తున్నాను.
Also Read
- Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
- Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
- Amrapali Dubey: "పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను".. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
- Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్‌గా పని కనిచేస్తున్న రాజమౌళి
‘టన్నెల్’లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి?
‘టన్నెల్’ మూవీ కథ చాలా కొత్తగా ఉంటుంది. కథ అంతా కూడా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. పోలీసుల్ని హీరో ఎలా కాపాడతాడు? సైకోని ఎలా పట్టుకుంటాడు? టన్నెల్‌కి ఈ కథకు సంబంధం ఏంటి? అన్న పాయింట్లను ఆసక్తికరంగా మలిచాడు. సీటు ఎడ్జ్ థ్రిల్లర్‌గా ‘టన్నెల్’ ఉంటుంది.
‘టన్నెల్’ టీజర్, ట్రైలర్‌కు తెలుగులో వచ్చిన స్పందనపై మీరు సంతృప్తిగా ఉన్నారా?
‘టన్నెల్’ టీజర్‌కి, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. తమిళంలో ఈ మూవీని అందరూ మెచ్చుకుంటున్నారు. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.
లచ్చురామ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
నా బ్యానర్లో ఇది వరకు దమ్మున్నోడు, స్వేచ్ఛ అనే చిత్రాలు నిర్మించాను. త్వరలోనే ‘శ్రీ గాంధారి’ అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. ఇంకా కొన్ని చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మా ఫోకస్ అంతా కూడా ‘టన్నెల్’ మీదే ఉంది. ఈ మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.
‘టన్నెల్’ గురించి ఆడియెన్స్‌కి ఏం చెబుతారు?
‘టన్నెల్’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు. యాక్షన్, లవ్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల అంశాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. తెలుగు వారందరినీ ‘టన్నెల్’ మెప్పిస్తుందని నమ్మకంగా ఉన్నాను.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
-
PM Modi: డ్రగ్స్‌కు దూరంగా యువత.. వికసిత్ భారత్‌కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
-
India vs Sri Lanka: గంభీర్‌కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్‌కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
-
US Visa Rules 2026: అమెరికా వీసాకు ఇక రూ.17 లక్షల బాండ్.. భారతీయులకు భారీ ఊరట.. పూర్తి వివరాలు ఇవే
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!