NTV Telugu Site icon

Unstoppable : ఒక రోజు ముందుగానే బాలయ్య పండుగ

Usb2

Usb2

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లి చెందిన ప్రముఖ నటి నటులు తమ తమ విషయాలను బాలయ్య తో పంచుకుని ఆడి పాడి అలరించారు. ఈ సూపర్ హిట్ టాక్ షో నాలుగో సీజన్ ఇటీవల స్టార్ట్ అయింది. మొదటి ఎపిసోడ్ కు గాను ఏపీ సీఎం నందమూరి బాలకృష్ణ ఈ టాక్ షోకు విచ్చేసారు. .

తాజాగా అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 సెకండ్ ఎపిసోడ్ లో మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ తో పాటు ఆయన నటించిన లక్కీ భాస్కర్దర్శకుడు వెంకీ అట్లూరి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. అందుకు సంబందించిన ప్రోమో ఇటీవల విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ షోలో నందమూరి బాలకృష్ణ దుల్కర్ సల్మాన్ తండ్రి మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టికి వీడియో కాల్ చేసి దుల్కర్ గురించి కంప్లైంట్ చేయడడం ఈ ఎపిసోడ్ కె హైలైట్ గా నిలిచిందట. కాగా ఈ ఎపిసోడ్ నవంబరు 1 శుక్రవారం సాయంత్రం స్ట్రీమింగ్ కు తీసుకువస్తారని అంతా భావించారు. కానీ దీపావళి కానుకగా అన్ స్టాపబుల్ సీజన్ -2 ఎపిసోడ్ 2ను ఒక రోజు ముందుగా అనగా ఈ రోజే స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది ఆహా. ఈ విషయమై అధికారకంగా ప్రకటించారు ఆహా మేకర్స్. ఇంకెందుకు ఆలస్యం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ను దీపావళి పండుగ చేసుకుంటూ అన్ స్టాపబుల్ చూసేయండి.

Show comments